Cancellation of House Plots: టీడీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు.. బాధితుల ఆందోళన - ఇళ్ల పట్టాల రద్దుపై ఆందోళన
🎬 Watch Now: Feature Video
Paritala Sunitha Fires on MLA: పేద ఎస్సీల పట్టాలు తిరిగి ఇవ్వాలని.. లేకుంటే ఎంతవరకైనా పోరాడుతామని మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం బి.యాలేరులో ఎస్సీల ఇంటి స్థలాల్ని.. వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి రద్దు చేయించడాన్ని వ్యతిరేకిస్తూ.. బాధితులు ఆందోళన చేపట్టారు. బాధితులతో కలిసి మాజీమంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత ఎంఎస్ రాజు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులతో కలిసి.. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన పట్టాలు.. బోగస్ పట్టాలు అంటూ రద్దు చేయటంపై మండిపడ్డారు. తక్షణమే రద్దు చేసిన పేదల పట్టాలు తిరిగివ్వాలని సునీత డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు చేతనైతే అదనంగా భూమి కొనుగోలు చేసి పేదలకు ఇవ్వాలని.. అంతేకానీ గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటిని రద్దు చేయటం ఏంటని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఆగ్రహానికి గురి కావద్దని ఎంఎస్ రాజు హెచ్చరించారు. బాధితుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.