నడుము లోతు నీటిలో మునిగిన వరి పైరు - అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2023, 12:09 PM IST
Paddy Crops Were Submerged in Water: ఒక వైపు అకాల వర్షాలు మరోవైపు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో అనకాపల్లి జిల్లా కశింకోట మండలం ఏనుగుతుని పాలెం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తుఫాన్ దాటికి నేలకొరిగిన చూసి కన్నీరు మున్నీరు అవుతున్నారు. వందల ఎకరాల్లోని వరి పైరు నిండా నీట మునగడంతో ఆవేదన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట నీళ్ల పాలు అయిందన్న వేదన వారిని ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తుందని దిగులు చెందుతున్నారు. ఆరుగాలం కష్ట పడి పండించిన పంట నీట మునగడంతో శోక సంద్రంలో మునిగిపోయారు.
వేల రూపాయలు అప్పులు తెచ్చి పంటలు వేశామని ఇప్పడు పంట అంతా పాడైపోయిందని ఈ దశలో ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు మరో శరణ్యం లేదని వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక వరి పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. పైనుంచి వచ్చిన వరదనీరు పొలంలో నిలిచి నడుముల లోతుకు చేరుకుంది. వర్షపు నీటిలో చిక్కుకున్న వరిపైరును చూసి రైసు లబోదిబోమంటున్నాడు.