ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల బొమ్మలతో చిత్రకారుల నైపుణ్యాలు - అలరించిన ఓపెన్ఆర్ట్ - latest news prakasam district
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 2:28 PM IST
Open Art Program in prakasam district : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఓపెన్ ఆర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిత్రకారులు పాల్లొని ప్రకృతి, వన్యప్రాణుల చిత్రాలను గీశారు. ఈ ఓపెన్ ఆర్ట్ కార్యక్రమానికి చిన్న పిల్లలు కూడా పాల్లొని తన ప్రతిభను ప్రదర్శించారు.
Painters Participating in The Open Art Program : అటవీ శాఖ అధికారి ఓపెన్ ఆర్ట్ కార్యక్రమ విశేషాలను తెలిపారు. అటవీ వన్యప్రాణుల, ప్రకృతి రమణీయతను ప్రదర్శించే విధంగా చిత్రకారుల నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడారు. ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తూ క్లాత్ పై చిత్రకారులు బొమ్మలను గీశారని తెలిపారు. ప్రకృతి వన్యప్రాణులను ఉద్దేశించి బొమ్మలు గీసేందుకు ప్రకాశం జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పలువురు చిత్రకారులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. ఓపెన్ ఆర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉన్నత అధికారులు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.