One Year boy Died in Car Accident: కారు ఢీకొని చిన్నారి మృతి.. అక్కడ ఖననం చేసేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు... - అనంతపురం జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
One Year boy Died in Car Accident: కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ పసి ప్రాణం బలికాగా.. ఈ ఘటనపై ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని కారు యాజమాని ఇంటి ఎదుట పూడ్చేందుకు యత్నించారు. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. నగరంలో అదే కాలనీకి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి కారును ఓ వ్యక్తి డ్రైవింగ్ చేసుకుంటూ.. ఇంటి ఎదుటు ఆడుకుంటున్న దస్తగిరి, నూర్జహాన్ దంపతుల ఏడాది వయసున్న చిన్నారి మహమ్మద్ హసిఫ్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమ కుమారుడు మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు.. కారు యాజమాని ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడే మృతదేహాన్ని ఖననం చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వటంతో బాబు బంధువులు శాంతించారు. అంత్యక్రియల నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని శ్మశానానికి తరలించారు.