Old Man Facing Pension Problem in Prakasham: సగం నొక్కి.. రూ.1200 చేతిలో పెట్టారు.. వృద్ధాప్య పింఛన్లో చిత్రాలు - వెలగలయపల్లి పింఛన్ వార్త
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 10:47 PM IST
Old Man Facing Old Age Pension Problems in Prakasham: సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సహకారంతో గ్రామ వాలంటీర్ చేతివాటం చూపుతున్న ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అవ్వా, తాతలకు రావాల్సిన వృద్ధాప్య పింఛన్(Old Age Pension) విషయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌తో పాటుగా గ్రామ వాలంటీర్ చేతివాటం చూపించడంతో ఓ వృద్ధుడు ఇబ్బందులు పడిన ఘటన ప్రకాశం జిల్లా(Prakasham) పెద్ద చెర్లోపల్లిలో మండలం వెలగలయపల్లిలో నెలకొంది.
బాధితుడు చెంచయ్య వెల్లడించిన వివరాల ప్రకారం... చెంచయ్య కరోనా సమయంలో వరుసగా మూడు నెలల పాటు వృద్దాప్య ఫించన్ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు చెంచయ్య పింఛన్‌ను తొలగించారు. పింఛన్ తొలగించిన నాటి నుంచి అధికారుల చుట్టూ తిరగగా... ప్రభుత్వాధికారులు గత నెలలో తనకు మళ్లీ పింఛన్ మంజూరు చేశారు. అయితే తన ఆరోగ్యం బాగా లేని కారణంగా హెదరబాద్లో ఉన్న తన పిల్లల వద్ద ఉంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెంచయ్య తెలిపాడు. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్ తనకు పింఛన్ మంజూరైనట్లు ఫోన్ చేసిందని.. గ్రామానికి వచ్చి పింఛన్ తీసుకోవాలని చెప్పినట్లు చెంచయ్య వెల్లడించాడు.
తీరా పింఛన్ కోసం వస్తే.. తనకు రావాల్సిన రూ.2750 ఇవ్వకుండా.. కేవలం రూ.1200 మాత్రమే ఇచ్చినట్లు పేర్కొన్నాడు. డబ్బులు తక్కువగా ఇస్తున్నారని ప్రశ్నిస్తే.. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి అంతే ఇవ్వమన్నారని వాలంటీర్ మనీషా చెప్పినట్లు చెంచయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. పింఛన్ కోసం ఉదయం నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారని చెంచయ్య వెల్లడించాడు. ఎక్కువగా మాట్లాడితే తనకు వచ్చే పింఛన్ నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే అంశంపై స్థానిక ఎంపీడీవో(MPDO)కు ఫిర్యాదు చేశాడు. తనకు రావాల్సిన పింఛన్ మెుత్తం ఇప్పించాలని ఎంపీడీవోకు మొర పెట్టుకున్నాడు.