NRIs protest in Saudi Arabia for CBN : సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రుల ఆందోళన.. చంద్రబాబు అరెస్టుకు ఖండన - Saudi Arabia
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 12:40 PM IST
NRIs protest in Saudi Arabia for CBN: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు భారీ నిరసన చేపట్టారు. పది రోజులుగా గల్ఫ్ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా ఈ రోజు సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో అతి పెద్ద నిర్మాణ ప్రాజెక్ట్ లో పని చేస్తున్న వందలాది స్కిల్ల్డ్ వర్కర్స్... ఆందోళనలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రవేశ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ (Skill Development Scheme) పథకం ద్వారా లబ్ధి పొందిన ఇండస్ట్రియల్ ఎలెక్ట్రిసియాన్స్, హెవీ ఎక్విప్మెంట్ ఆపేటర్స్, వెల్డర్స్, సాంకేతిక నిపుణులు భారీగా పాల్గొన్నారు. చంద్రబాబు (Chandrababu)ను తప్పుడు కేసులతో వేధించడం అన్యాయమని, బాధాకరం అని తీవ్ర అందోళన వ్యక్తం చేశారు. అధినేత అరెస్టుకు నిరసనగా ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన తాము.. నేడు సౌదీలో సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నామని అందుకు కారణమైన చంద్రబాబుపై నేడు ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తెలుగు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేసి చంద్ర బాబుకు మద్దతు తెలిపిన తనజీబు, జుబైల్, డమ్మామ్, ఖిబర్, రియాద్ సహా చంద్రబాబు అభిమానులదరికీ సౌదీ అరేబియా టీడీపీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.