యువగళం విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు - లక్షలాదిగా తరలిరానున్న అభిమానులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 2:34 PM IST
Nara Lokesh's Jaitrayatra Victory : నవశకానికి నాంది అంటూ, జనగళమై యువగళమై సాగిన లోకేశ్ జైత్రయాత్ర విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద జరిగే బహిరంగ సభ నుంచే ఇరు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇరు పార్టీల అధినేతలు కీలక ప్రకటనలు వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు లక్షలాది మంది తరలి రానున్నారు. అభిమానులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను టీడీపీ ఏర్పాటు చేసింది.
Nara Lokesh Yuvagalam Padayatra : నారా లోకేశ్ ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడిచేందుకు జనవరి 27, 2023న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజక వర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగించే సమయానికి లోకేశ్ మొత్తం 3,132 కిలోమీటర్లు పూర్తిచేయనున్నారు.