Lokesh challenge వైఎస్ భారతిరెడ్డి ఈ చిన్న లాజిక్‌ని ఎలా మిస్ అయ్యారు..!: లోకేశ్ - YS Bharathi Reddy
🎬 Watch Now: Feature Video
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన యువగళం పాదయాత్ర బహిరంగ సభలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రసంగించారు. తాను దళితులను అవమానించానని సీఎం జగన్ సతీమణి, సాక్షి యజమాని భారతిరెడ్డి నిరూపించగలరా అంటూ నారా లోకేశ్ సవాల్ విసిరారు. ఒక వేళ నేను దళితులను అవమానించినట్లు నిరుపిస్తే.. రాజకీయాలనుంచి తప్పుకుంటాని లోకేశ్ తెలిపారు. నిరూపించలేకపోతే సాక్షి ఛానెల్, పత్రికను మూసేస్తారా అని నిలదీశారు. అవాస్తవ ప్రచారం మాని తన సవాల్‌ని స్వీకరించాలని స్పష్టంచేశారు. జగన్ తనను ఎదురుకోలేక వైఎస్ భారతిని రంగంలోకి దించారని లోకేశ్ విమర్శించారు. తనపై ఆరోపణలు చేసేందుకు భారతి.. స్వయంగా కంప్యూటర్ ముందు కుర్చోని ఎడిటింగ్ చేసిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. సభలో తాను దళితులపై విమర్శలు చేస్తే వారు తన సభలో చప్పట్లు కొడుతారా... అంటూ ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ వైఎస్ భారతి ఎలా మిస్ అయ్యారని ఎద్దేవా చేశారు. లోకేశ్ సభలో తెలుగుదేశం శ్రేణులతో పాటు జనసైనికులు పాల్గొని లోకేశ్‌కు సంఘీభావం తెలిపారు.