మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నారా లోకేశ్ క్రిమినల్ కేసు దాఖలు - Minister Peddireddy news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 16, 2023, 10:27 PM IST
|Updated : Dec 17, 2023, 6:12 AM IST
Nara Lokesh Case Filed on Minister Peddireddy: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుంటూరు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి సాక్షి దినపత్రిక ద్వారా తనపై మోపిన నిందలకు నష్టం పరిహారంగా రూ.50 కోట్లు చెల్లించాలని లోకేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే సాక్షి దినపత్రిక ద్వారా తనకు బహిరంగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ మంత్రికి లీగల్ నోటీసులు పంపారు.
Legal Notices Issued to Minister Peddireddy: సాక్షి దినపత్రిక ద్వారా లోకేశ్‌పై నిందారోపణలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై గుంటూరు మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు అయ్యింది. 'నారాసురుడే ఇసుకాసురుడు' అనే శీర్షికతో వెలువడిన వార్తలో మంత్రి పెద్దిరెడ్డి తనపై మోపిన నిందలకు గాను నష్టం పరిహారంగా రూ.50 కోట్లు చెల్లించాలని నారా లోకేశ్ గురువారం గుంటూరు మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. అదే సాక్షి దినపత్రిక ద్వారా తనకు బహిరంగా క్షమాపణలు చెప్పాలని లోకేశ్ తరఫున న్యాయవాది దొద్దాల కోటేశ్వర రావు మంత్రికి లీగల్ నోటీసులు పంపారు. ఆ నోటీసులో లోకేశ్‌కు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.