గుంటూరులో వేడుకగా నంది నాటకోత్సవాలు - Nandi Natakotsavalu Begins Guntur

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 9:41 AM IST

Nandi Drama Festivals in Guntur District : గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో నంది నాటకోత్సవాలు వైభవంగా జరిగాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు పౌరాణిక, సామాజిక ఇతివృత్తాలతో కూడిన నాటకాలను ప్రదర్శించారు. బాలకార్మిక వ్యవస్థపై డాక్టర్ పీవీఎస్ కృష్ణ రూపొందించిన 'మంచి గుణ పాఠం', అలాగే అక్రమ సంబంధాలు అనర్థాలపై పిటి మాధవ్ రచించిన 'నిశ్శబ్ధము', 'నీ ఖరీదెంత' నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలంగాణలో జరిగిన దిశ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని 'ఇంకెన్నాళ్లు' అనే నాటికను ప్రదర్శించారు. 

Nandi Natakotsavalu in AP : కమనీయం, జరుగుతున్న కథ వంటి నాటికలు కూడా ఇక్కడి ప్రదర్శనల్లో ఉన్నాయి. సవేరా ఆర్ట్స్ సంగీత నాటక సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ పాదుకలు నాటకాన్ని ప్రదర్శించారు. ఆయా నాటకాలు ముగియగానే కళాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ నాటకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఏపీఎఫ్​డీసీ (APFDC) ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, ఎండీ(MD) తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఇతర అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.