ఏపీ ప్రజలు మంచి ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారు: నాదెండ్ల

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 7:03 PM IST

thumbnail

Nadendla Manohar comments on TDP Janasena alliances: ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తున్నాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభలో నాదెండ్ల మాట్లాడారు. జగన్‌ అరాచక పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని మనోహర్ ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో అవమానాలు, వేధింపులకు గురయ్యామని వెల్లడించారు. త్వరలో మంచి ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారని నాదెండ్ల పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు మారాలనే దిశగా పవన్‌ అడుగులు వేసినట్లు తెలిపారు. అవినీతి ప్రభుత్వంలో ఏపీ ప్రజలకు నిరాశే మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని నమ్మిన యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎంగా జగన్​కు ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఎంత పొరపాటు జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. ఆ ఒక్క ఛాన్స్​తో  రాష్ట్రానికి వచ్చిన ఎన్నో మంచి అవకాశాలను కోల్పోయామని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. జనసేన షణ్ముఖ వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందన్నారు. రానున్న ఎన్నికల తరువాత రాష్ట్రంలో అద్భుత ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని తెలిపారు. త్వరలోనే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుతారని పేర్కొన్నారు.  రాబోయే రోజుల్లో చంద్రబాబు సుదీర్ఘ అనుభవంతో పాటుగా, పవన్‌ నాయకత్వం తోడై రాష్ట్రప్రజలకు మంచి జరుగుతుందని అని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.