"మైనార్టీ దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదు" - Abul Kalam Azad
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 6:53 AM IST
Muslim Minority Rights Committee on CM Jagan: అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మైనార్టీ దినోత్సవాన్ని.. నిర్వహించే నైతిక హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు షారుఖ్ షిబ్లీ మండిపడ్డారు. ఈ నెల 11వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో.. ప్రభుత్వం అబుల్ కలాం అజాద్ జయంతిని (Abul Kalam Azad Birth Anniversary in AP) నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా షారుఖ్ షిబ్లీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు.
మైనార్టీల కోసం కేవలం 4కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. సీఎం జగన్ మోహన్ రెడ్డి 23 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం టీడీపీ హయంలో రంజాన్తోఫాకు 20 కోట్ల రూపాయల వరకు ఖర్చుపెడితే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కేవలం ఒక కోటి 60 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే.. పలు పథకాలను ప్రారంభించి మైనార్టీలకు లబ్ది చేకూరుస్తామని నమ్మబలికారని అన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 80 మందికే లబ్ది చేకూరిందని వివరించారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు.