Agri Gold Victims: "అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 15 వరకు న్యాయం చేయాలి.. లేకపోతే"
🎬 Watch Now: Feature Video
Round Table Meeting for Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయకపోతే తాడోపేడో తేల్చుకుంటామని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. శ్రీకాకుళంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఆగస్టు 15వ తేదీ వరకు అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని.. లేకపోతే ఆగస్టు 30వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. డిసెంబర్ నాటికి అగ్రిగోల్డ్ వ్యవహారం పూర్తిగా తేల్చాలని హెచ్చరించారు. ఈ అంశంపై ఎన్నిరోజులైనా జైలుకు వెళ్లటానికైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటనల కోసం పేపర్లు, ఛానళ్లకు చెల్లిస్తున్న డబ్బులను.. అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తే సరిపోతుందని టీడీపీ నేత కూన రవికుమార్ పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు అండగా ఉంటారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు అవమానాలు భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.