తొలగిస్తున్నామంటూ అధికారుల నోటీసులు-బెదిరింపులకు భయపడమంటూ, నోటీసులను తగులబెట్టిన మున్సిపల్ కార్మికులు - Protests in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 7:47 PM IST
Municipal Workers Protest in Nellore: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు తమను పర్మినెంట్ చేయాలని, పాదయాత్రలో జగన్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆందోళన చేస్తున్న కార్మికులను విధులు నుంచి తొలగిస్తున్నామంటూ నెల్లూరులో అధికారులు నోటీసులు జారీ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరులో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీనిలో భాగంగా మున్సిపల్ వర్కర్ల ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని కార్పోరేషన్ కార్యాలయం నుంచి వీఆర్సీ కూడలి గాంధీ బొమ్మవరకు భారీ ర్యాలీ చేశారు. మాట తప్పిన ముఖ్యమంత్రి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసనలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను విధులు నుంచి తొలగిస్తున్నామంటూ నోటీసులు జారీ చేశారు. అధికారులు ఇచ్చిన నోటీసులను అందుకున్న పారిశుద్ధ్య కార్మికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమైయ్యాయి. ఆ నోటీసులను మంట్లల్లో తగలపెట్టి పెద్దఎత్తున నినాదాలు చేశారు. బెదిరింపులకు, తాటాకు చప్పుళ్ళకు, కక్ష్య సాధింపు చర్యలకు భయపడి సమ్మెను ఆపమంటూ మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు.