MP Raghu Rama Krishna Raju Comments on YSRCP Government: మార్గదర్శి అంశంలో మా ప్రభుత్వం తప్పు చేసింది: ఎంపీ రఘురామ - MP Raghu Rama Krishna Raju
🎬 Watch Now: Feature Video
MP Raghu Rama Krishna Raju Comments on YSRCP Government: మార్గదర్శి చందాదారులకు నోటీసుల అంశంలో తమ ప్రభుత్వం తప్పు చేసిందని.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మార్గదర్శి చందాదారులకు నోటీసుల అంశంపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయని.. తీర్పు రిజర్వులో ఉందని.. ఈ వారంలో కోర్టు ఆదేశం వస్తుందని రఘురామ చెప్పారు. దిల్లీలో ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్గదర్శి అంశంలో ఏపీ ప్రభుత్వాన్ని కోర్టులు అనేకసార్లు తప్పుబట్టాయన్నారు. ఈనాడు పత్రిక రాసే నిజాలను చంపేందుకు జగన్ ప్రభుత్వం యత్నింస్తోందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా రామోజీరావు నిజాలు రాయడం మానరన్నారు. నిజాలు రాస్తేనే పత్రికలకు ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందని రఘురామకృష్ణరాజు అన్నారు. నిజాలు రాసే పత్రికలనే ప్రజలు కొంటారన్న రఘురామ.. బలవంతంగా అంటగట్టే పత్రికలను ప్రజలు కొనరని స్పష్టం చేశారు. ఈనాడు పత్రికలోని నాణ్యత కోసం పాఠకులు కొంటున్నారని పేర్కొన్నారు. సీఐడీ పనికిమాలిన తనానికి, చిత్రహింసలకు తానే ప్రత్యక్ష సాక్షిని అంటూ రఘురామ వ్యాఖ్యలు చేశారు.