రైతులను అప్రమత్తం చేయడంలో వైసీపీ సర్కారు విఫలం : నిమ్మల - Crop loss due to michaung cyclone
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 6:30 PM IST
MLA Nimmala Ramanaidu Fire on YCP Govt: మిగ్జాం తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొల్లు నియోజకవర్గం (Palakollu Constituency)లో తడిసిన ధాన్యం రాశులు, ముంపునకు గురైన వరి చేలను ఎమ్మెల్యే రామానాయుడు పరిశీలించారు.
MLA Nimmala on Farmers problems in AP: జోరువానలో తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న కష్టంలో ఆయన కూడా పాల్పంచుకున్నారు. రైతులతో కలిసి పార చేతపట్టి బాటలు తీసి వర్షపు నీటిని దారిమళ్లించారు. పంట చేతికందే సమయంలో మిగ్జాం తుపాను (Michaung Cyclone) ప్రభావంతో నీటిపాలైందని రైతులు (Farmers) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వర్షానికి తడిసి రంగుమారిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(MLA Nimmala Ramanaidu) డిమాండ్ చేశారు.