MLA was paraded on palanquin విమర్శలకు దారి తీసిన ఎమ్మెల్యే పల్లకి ఊరేగింపు.. ఎక్కడంటే..! - MLA Jogarao
🎬 Watch Now: Feature Video

MLA Jogarao was paraded in a palanquin: పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని నూకలవాడలో ఎమ్మెల్యే జోగారావును గ్రామస్తులు పల్లకిలో ఊరేగించారు. ఈఘటనపై నియోజక వర్గంలో తీవ్ర రాజకీయ విమర్శలు వ్యక్తమైయ్యాయి. ఈ గ్రామానికి నాలుగు దశాబ్దాలుగా తారు రోడ్డు సౌకర్యం లేదు. ఇన్నాళ్లు ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా నెరవేర్చలేదు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జోగారావు గ్రామంలో పర్యటించారు. ఈ సమయంలో గ్రామస్థులు రోడ్డు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రోడ్డును వేయించారు. దీంతో శుక్రవారం రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యేను సర్పంచ్ ఝాన్సీ ఆధ్వర్యంలో గ్రామస్థులు సత్కరించి ఊరేగించారు. గ్రామాల్లో తాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. పనుకుపేటలో ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోందని ఎమ్మెల్యే కళావతి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ డి వెంకటరమణనాయుడు, జడ్పీటీసీ సభ్యురాలు జె కన్న తల్లి, సర్పంచ్ జగన్మోహనరావు, నాయకులు. పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.