కరెంటు లేకపోతే గొడవ చేస్తారు - ఇస్తే బిల్లు ఎక్కువ వస్తుందంటారు ఎలా? : వైసీపీ ఎమ్మెల్యే ఉచిత సలహా! - గుంటూరు విద్యుత్ సబ్ స్టేషన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 1:45 PM IST
MLA Inaugurated Current Sub Station In Guntur: గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రజలకు కరెంటు ఎంత తక్కువ వాడితే ఆమేరకు బిల్లును పొదుపు చేయవచ్చని సూచిస్తున్నారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో 3.50కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్ను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు కరెంటు కష్టాలు తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు.
ప్రజలు మాత్రం కరెంట్ లేకపోతే ప్రభుత్వం కోతలు విధించిందని.. కరెంట్ ఇస్తే బిల్లులు ఎక్కువ వచ్చాయని విమర్శలకు దిగుతున్నారని ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు నాలుగుసార్లు పెంచిన విషయం పక్కనపెట్టి కరెంటు వాడితే బిల్లు అధికంగా వస్తుందని, కరెంటు వాడకపోతే బిల్లు తగ్గుతుందని మాట్లాడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కులం, మతం చూడలేదు కాబట్టే జనసేనకు మద్దతున్న గ్రామంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.