Misses Vizag-2023 Beauty Competitions: ఘనంగా మిస్సెస్ వైజాగ్-2023 అందాల పోటీలు.. క్యాట్ వాక్‌లో 'చీరే'శారుగా! - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 2:18 PM IST
|Updated : Oct 9, 2023, 3:51 PM IST
Misses Vizag-2023 Beauty Competitions: విశాఖ జిల్లా భీమిలి బీచ్ తిమ్మాపురంలో మిస్సెస్ వైజాగ్-2023 అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ అండ్ హేంఫ్సైర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 26 మంది మగువలు పోటీపడ్డారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా వైజాగ్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు కాయల వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ సునీతి, డాక్టర్ సునీత ప్రశాంతి వ్యవహరించారు. ర్యాంపుపై శారీ వాక్, క్యాట్ వాక్‌లతో ముద్దుగుమ్మలు అదరగొట్టారు.
క్వశ్చన్ రౌండ్లో మిస్సెస్ వైజాగ్ 2023 విజేతగా సాక్షి బజాజ్ ఎన్నికైంది. ఫస్ట్ రన్నరప్‌గా లక్కీ, సెకెండ్ రన్నరప్‌గా సవిత ఎన్నికయ్యారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి శ్రీలంక టూర్, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి నేపాల్ టూర్ ఉంటుందని ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు కాయల వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ మెంబర్ ఎంఎస్ఎం రాజు, సంయుక్త కార్యదర్శి ఎన్ఆర్కే రెడ్డి, అడ్మినిస్ట్రీస్ సన్ చైర్మన్ కంటిపూడి వెంకటేశ్వర్లు, ఈవెంట్ మేనేజర్ వాసు తదితరులు పాల్గొన్నారు.