Minister Botsa Sathyanarayana on CBN Letter చంద్రబాబు లేఖపై బొత్స వ్యంగస్త్రాలు.. ఆయన ఏ లేఖైనా రాస్తాడంటూ విమర్శలు.. - నిజం గెలవాలి యాత్రపై బొత్స సత్యనారాయణ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 9:50 PM IST
Botsa Sathyanarayana on CBN Letter to ACB Court Judge: రాజమండ్రి జైలులో తనకు ప్రాణహాని ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన లేఖపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరీ గురువారం. వైసీపీ నుంచి రాష్ట్రానికి స్వాతంత్య్రం కావాలన్న వ్యాఖ్యలపైనా ఆయన వ్యంగ్యంగా స్పందించారు. వైసీపీ సామాజిక సాధికార యాత్రలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ లేఖ అయినా రాస్తాడని అన్నారు. పందిని నందిగా.. నందిని పందిగా చేసేందుకు ప్రయత్నిస్తారని.. ఆయన ఏది చేసినా చట్టం, రాజ్యాంగం ఉన్నాయని వ్యగ్యంగా స్పందించారు.
రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా ఏమి చేయాలో ప్రభుత్వాలు అవి చేస్తాయన్నారు. చట్టాన్ని ఏవరూ చేతిలోకి తీసుకోరని.. చట్టం తనపని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా భువనేశ్వరికి ఆమెకు ఏమి ఇబ్బంది వచ్చిందని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆమె సభలు నిర్వహించడం లేదా.. ఆ స్వాతంత్య్ర సరిపోదా అంటూ వ్యాఖ్యనించారు. అంతే కాకుండా ఇంకా ఏం స్వాతంత్య్రం కావాలన్నారు. ఆమె న్యాయం గెలవాలని తిరుగుతోందని.. చంద్రబాబు అవినీతి చేయలేదా అంటూ విమర్శలు చేశారు. అలా చేయకపోతే కోర్టులు ఎందుకు శిక్షిస్తాయంటూ బొత్స ఆరోపణలు చేశారు.