Mid day Meal Workers Protest: మూడు వేల జీతం.. గ్యాస్ సిలిండర్లకే సరిపోతోంది.. మేము ఎట్లా బతికేది? - Mid day meal workers agitation in Visakhapatnam
🎬 Watch Now: Feature Video
Mid day Meal Workers Protest: ఇచ్చేది 3 వేల రూపాయల వేతనం.. అది కూడా గ్యాస్ సిలిండర్ల కోసమే సరిపోతోంది. ఇక మేం బతికేది ఎట్లా జగనన్నా అంటూ.. విశాఖలో మధ్యాహ్న భోజనం కార్మికులు రోడ్డెక్కారు. విద్యార్థులకు ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వాలి.. రోజూ అంబలి సరఫరా చేయాలంటున్న ప్రభుత్వం.. వాటిని చేయడానికి అవసరమయ్యే గ్యాస్ మాత్రం మీరే కొనుక్కోవాలని చెప్పడంపై.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకి రెండు సిలిండర్లు అవుతున్నాయని వాపోతున్నారు. ఇచ్చే అరకొర జీతాలు కూడా మూడు, నాలుగు నెలలకి ఒకసారి వస్తున్నాయని తెలిపారు.
3000 జీతం అంటే ఇంట్లో ఖర్చులకు అయినా వస్తాయనుకున్నామని.. కానీ ప్రస్తుతం పెరిగిన ఖర్చుల కారణంగా అవి గ్యాస్ సిలిండర్లకే సరిపోతున్నాయని వాపోతున్నారు. సీఎం జగన్ తమ ఆకలి కేకలు వినాలని.. కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. బిల్లులు , వేతనాలు.. ప్రతి నెలా 5వ తేదీకి ఇవ్వాలని.. గ్యాస్ సరఫరా ప్రభుత్వమే చెయ్యాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇప్పటికి అయినా తమ ఆకలి కేకలు వినాలని కోరుతున్నారు.