Young Man Climbs Hospital Building: హాస్పిటల్ పైకెక్కిన మతిస్థిమితం లేని యువకుడు.. రెండు గంటలకు పైగా హల్​చల్​..

By

Published : Jul 12, 2023, 3:52 PM IST

thumbnail

Young Man Climbs Hospital Building: నంద్యాల సంజీవనగర్​లోని ఒక ప్రైవేటు ఆస్పత్రి ఐదంతస్తుల భవనం పైకెక్కి ఓ యువకుడు హల్​చల్ చేశాడు. నంద్యాల జిల్లాలోని పాణ్యం చెంచుకాలనికి చెందిన అంజి అనే యువకుడు నేరుగా హాస్పిటల్ భవనంపైకి ఎక్కాడు. యువకుడిని గమనించిన స్థానికులు అతడిని దించేందుకు ప్రయత్నించారు. అయితే అతడు తన భార్యాపిల్లలను పిలుచుకుని వచ్చేంతవరకు అక్కడి నుంచి దిగనని మొండికేశాడు. సుమారు రెండున్నర గంటలపాటు అతడు.. హాస్పిటల్ నాలుగో అంతస్తులో ఉన్న కిటికీ పైకప్పుపై కూర్చుని ఉండిపోయాడు. యువకుడిని దించేందుకు ఎంతమంది ప్రయత్నించినా అతడు వినకుండా మొండికేసి అక్కడే కూర్చున్నాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఎట్టకేలకు స్థానికుల సహకారంతో పోలీసులు అతడిని అక్కడి నుంచి సురక్షితంగా దించి పోలీస్ స్టేషన్​కు తీసుకుని వెళ్లారు. అనంతరం పూర్తి వివరాలకై అతడిని పోలీసులు విచారణ చేపట్టారు. కాగా.. యువకుడికి మతిస్థిమితం సరిగాలేదని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లిడించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.