Lovers: గుళ్లోకి వెళ్లి తాళం వేసుకున్న ప్రేమ జంట.. కట్ చేస్తే..! - ప్రేమజంట హడావుడి
🎬 Watch Now: Feature Video
Lovers : మచిలీపట్నం గ్రామీణం బుద్దాలపాలెం గ్రామంలో ఓ ప్రేమజంట హడావుడి సృష్టించింది. బుద్దాలపాలెం గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న గాయత్రికి ఆదే గ్రామానికి చెందిన నాగరాజుతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. తమ ప్రేమకు పెద్దలు అనుమతించలేదని గ్రామంలోని రామాలయంలోకి వెళ్లి ప్రేమికులు గడియ పెట్టుకున్నారు. ప్రేమజంట హడావుడితో గ్రామంలో కలకలం రేగింది. తాము పెళ్లి చేసుకున్నామని, తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం ఉందని ప్రేమికులు తెలిపారు. పోలీసుల రక్షణ కావాలని వారు కోరగా.. సమాచారం అందుకున్న పోలీసులు గుడి వద్దకు వచ్చి మాట్లాడారు. ప్రేమికులతో మాట్లాడి వారిని బయటకు రావాలని నచ్చజెప్పి తీసుకువచ్చారు. ప్రేమికులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... బుద్దాలపాలెం గ్రామంలో ప్రేమజంట ఆలయంలోకి వెళ్లి గడియ పెట్టుకున్నట్లుగా మాకు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్లామని తెలిపారు. ప్రేమజంట తమకు రక్షణ కావాలని కోరగా.. వారిని స్టేషన్ కు తీసుకెళ్లామని చెప్పారు. పూర్తి వివరాలు, వయస్సు ధ్రువీకరణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు.