యువగళం విజయోత్సవ సభకు ఏర్పాట్లు - పరిశీలించిన టీడీపీ నేతలు - పోలిపల్లి లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 1:07 PM IST
Lokesh Yuvagalam Yatra Closing Meeting Arrangements: యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరగనున్న సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు(TDP Atchannaidu)తో పాటు చిన్నరాజప్ప, అలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు తదితర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు వైఎస్సార్సీపీకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదని 5కోట్ల ఆంధ్రులకు జగన్ సర్కారుకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు.
Nara Lokesh Yuvagalam Padayatra Updates: లోకేశ్ యువగళం పాదయాత్ర సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న విజయోత్సవ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ హాజరుకానున్నారు. సభకు లక్షలాదిమంది తెలుగుదేశం, జనసేన శ్రేణులు తరలిరానున్నట్లు అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, పార్కింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీడీపీ నేతలు తెలిపారు. తరలిరానున్న శ్రేణుల కోసం ఇప్పటికే 7ప్రత్యేక రైళ్లను టీడీపీ ఏర్పాటు చేసింది.
TAGGED:
tdp atchannaidu latest news