Lokesh Fire on MLA Kasu Mahesh in Piduguralla Meeting: కొన్ని నెలలు ఓపిక పట్టండి.. క్యాష్ మహేష్‌ను పిల్లి మహేష్ చేస్తాం: లోకేశ్ - గురజాల ఎమ్మెల్యేపై నారా లోకేశ్ ఫైర్
🎬 Watch Now: Feature Video
Lokesh Fire on MLA Kasu Mahesh in Piduguralla Meeting: అభివృద్ధి చేస్తారని కాసు మహేష్ రెడ్డిని గెలిపిస్తే.. ఆయన గురజాలకు గుండు కొట్టారని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో యరపతినేని రూ. 2 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్.. పిడుగురాళ్లలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. కాసు మహేష్‌రెడ్డి అవినీతి గురించి తెలుసుకున్న తరువాత.. ఆయన పేరు క్యాష్ మహేష్‌రెడ్డిగా మార్చామని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ ద్వారా కాసు మహేష్‌రెడ్డి వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. అంతేకాకుండా భూదందాలు, మద్యం, క్లబ్బులు, గంజాయి ద్వారా భారీగా దోచుకున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి.. గురజాలలో అమ్ముతున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. నరసారావుపేటలో 200 కోట్లతో కాసు మహేష్ రెడ్డి ఓ షాపింగ్ క్లాంపెక్స్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా తొమ్మిది నెలలు ఓపిక పడితే.. క్యాష్ మహేష్‌ని.. పిల్లి మహేశ్ చేసే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్ తెలిపారు.
TAGGED:
lokesh on kasu mahesh