Polamreddy Dinesh Reddy: రాజుపాలెంలో ఉద్రిక్తత.. టీడీపీ ఇన్చార్జ్ అరెస్టు - రాజుపాలెంలో ఉద్రిక్తత
🎬 Watch Now: Feature Video
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. ఇటీవల రాజుపాలెం వద్ద గ్రావెల్ తరలిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.
వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ నాయకులపై దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నాయకులకు గాయాలు అయ్యాయి. పోలీసులు నలుగురు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసారు. ఈ దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు బాధితుల ఇంటికి వెళ్తుండగా పోలం రెడ్డి దినేశ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దినేష్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఆయన టీడీపీ నాయకులతో, వందలాది మంది కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన పోలంరెడ్డి దినేష్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని పోలీస్ స్టేషన్కి తరలించారు. దీంతో కొడవలూరు మండలం రాజుపాళెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ జిందాబాద్, వైఎస్సార్సీపీ డౌన్ డౌన్ అంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.