Kodali Nani Participated in Chiranjeevi Birthday Celebrations: చిరంజీవిని విమర్శిస్తే.. ఏం జరుగుతుందో తెలుసు: కొడాలి నాని - చిరంజీవి సినీ ప్రస్తానం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2023, 4:31 PM IST
Kodali Nani Participated in Mega Star Chiranjeevi Birthday Celebrations: కృష్ణాజిల్లా గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, చిరంజీవి అభిమానులకు పంచారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ విసిరారు. తాను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయని విమర్శించారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసని, తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు.. తామంతా క్లారిటీగానే ఉన్నామన్నారు. జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానన్నారు.
ఎవరి జోలికి వెళ్లని పెద్దాయన చిరంజీవి అని.. ఆయనను విమర్శించే సంస్కారహీనుడుని కాదని నాని చెప్పారు. చిరంజీవికి, తమకు మధ్య అగాథం సృష్టించాలని చిరంజీవి అభిమానుల ముసుగులో... టీడీపీ జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొర్లారని కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం తరఫున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన.. చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టానని గుర్తు చేశారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామన్నారు. తమకు సలహా ఇచ్చినట్లే... డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీగాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పానని కొడాలి నాని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డ్యాన్సులు, యాక్షన్ రాదా... తాను ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. తన వెంట ఉన్న వ్యక్తులు 60 శాతం చిరంజీవి అభిమానులే అని కొడాలి స్పష్టం చేశారు.