Kannappa Movie Unit in Srikalahasteeswara Temple: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కన్నప్ప చిత్ర బృందం సందడి - Nupur Sanan in Srikalahasteeshwara temple
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-08-2023/640-480-19296758-thumbnail-16x9-kannappa-movie-unit.jpg)
Kannappa Movie Unit In Srikalahasteeswara Temple: తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కన్నప్ప చిత్ర బృందం సందడి చేసింది. ప్రేక్షకులందర్ని ఆకట్టుకునేలా కన్నప్ప సినిమా చిత్రీకరణ చేపట్టనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. మంచు మోహన్ బాబు, ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న నుపూర్ సన్నన్తో పాటు చిత్ర బృందం ఆలయానికి చేరుకుని.. స్వామివారు, అమ్మవార్ల పూజ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ అన్ని భాషల్లోని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా చిత్రీకరణ చేపడతామని వివరించారు. నెలఖారు నుంచి సినిమా ష్యూటింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సుమారు ఐదు భాషల్లో ఈ చిత్ర నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా ఆయన వివరించారు. న్యూజిలాండ్‌తో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం మోహన్‌బాబు కుటుంబ సభ్యులతో కలిసి అభిషేక పూజధికాలు చేయించారు. ఈ కార్యక్రమంలో తితిదే చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.