Kandula Durgesh: "పవన్ వారాహి యాత్రతో ప్రభుత్వం వెన్నులో వణుకు.. అందుకే పోలీసు చట్టం"
🎬 Watch Now: Feature Video
Kandula Durgesh Interview: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రేపటి (జూన్ 14) నుంచి ప్రారంభం కానుంది. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్రం నుంచి యాత్రకు జనసేనాని శ్రీకారం చుట్టనున్నారు. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగించనున్నారు. అలాగే కొన్ని చోట్ల సభలు కూడా నిర్వహించనున్నారు. వారాహి యాత్రలో భాగంగా జనసేనాని నిన్నటి నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజు ఉదయం గణపతి పూజ, సాయంత్రం జ్యోతిర్లింగార్చన జరిపి.. నేడు మలిరోజు క్రతువు, పూర్ణాహుతితో యాగం పూర్తి అవుతుంది. అనంతరం జనసేనాని కాకినాడకు బయలుదేరుతారు. పవన్ వారాహి యాత్రతో ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలైందని.. అందుకే అడ్డుకునేందుకు పోలీస్ చట్టం అమలులోకి తెచ్చారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆరోపించారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా పవన్ వారాహి యాత్రను విజయవంతం చేస్తామంటున్న దుర్గేష్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.