'వైసీపీ పాలన నుంచి ప్రజలను కాపాడేందుకే టీడీపీ-జనసేన పార్టీల కలయిక'
🎬 Watch Now: Feature Video
Joint Meeting of TDP and Janasena Parties in Elamanchili Constituency: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యలమంచిలి నియోజకవర్గ టీడీపీ, జనసేన పార్టీ నేతల ఉమ్మడి సమావేశం విజయవంతంగా జరిగింది. ఇరు పార్టీల నుంచి వేల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుందరపు విజయకుమార్ల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
TDP Janasena Joint Program for Development of State: ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక అధికారం కోసం కాదని.. జగన్ అనే రాక్షసుడిని పదవి నుంచి దించి రాష్ట్రాన్ని కాపాడటం కోసం అని స్పష్టం చేశారు. రెండు పార్టీల ఉమ్మడి సమావేశంలో జగన్ను ఎలా గద్దె దించాలని చర్చించామన్నారు. జగన్ అనే నరకాసురుని ఇంటికి పంపించాలని తీర్మానించారు. ఇరుపార్టీల నాయకులు ముందుగా ఓటర్ల జాబితాపై దృష్టి సారించాలన్నారు. అధికార పార్టీ నాయకులు చేర్పించిన దొంగ ఓట్లు వెలికి తీయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేపడుతున్నఉమ్మడి కార్యక్రమమే టీడీపీ-జనసేన పార్టీల కలయిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చలపతిరావు, టీడీపీ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.