ఎన్నికల సమీపిస్తున్న వేళ - వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి భారీగా పెరుగుతున్న చేరికలు
🎬 Watch Now: Feature Video
Joining From YCP to TDP Increasing: ఒక పక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ల నియామకాల్లో వైఎస్సార్సీపీ అధిష్టానం తర్జన బర్జన పడుతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతునే ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరంలో 300 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కాగా మాజీ మంత్రి చినరాజప్ప కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మరో వైపు విజయనగరం 43వ డివిజన్లో వైసీపీకి చెందిన 50 కుటుంబాలు నియోజకవర్గ ఇన్ఛార్జి అదితి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశంలోకి చేరాయి. వారందరికీ కండువా కప్పి అదితి గజపతిరాజు పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని అదితి విమర్శించారు. సంక్షేమ పాలన, మహిళా సాధికారత చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదితి పిలుపునిచ్చారు. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.