సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన జేడీ లక్ష్మీనారాయణ - political news ap

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 7:26 PM IST

JD Lakshmi Narayana Suppor to Samagra Siksha Employees : విద్యాశాఖ పరిధిలో పని చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల హక్కులకు రాష్ట్ర ప్రభుత్వం భంగం కలిగిస్తోందని జై భారత్​ నేషనల్​ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ విమర్శించారు. విజయవాడలోని ధర్నా చౌక్​ వద్ద సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి, వారికి సంఘీభావం తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ పథకాల లబ్ధి, నెల ప్రారంభంలో వేతనాలను చెల్లించడం మొదలైన డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లక్ష్మీనారాయణ డిమాండ్​ చేశారు. సీఎం జగన్​ మోహన్​ రెడ్డి పాదయాత్ర సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోని రాగానే వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రెండు నెలల నుంచి వేతనాలను చెల్లించలేదని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారికి అధికారులు నోటీసులు జారి చేయడం ఏంటని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.