రేపు పీఎస్​ఎల్వీ-సీ58 ప్రయోగం - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు - PSLV C58

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 5:00 PM IST

Updated : Dec 31, 2023, 5:58 PM IST

ISRO Scientists And Union Minister Narayan Rane Visit in Tirumala: ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో  తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు, కేంద్ర మంత్రి నారాయణ్ రాణె దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి సేవలో పాల్గొన్నారు. జనవరి 1న సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి ప్రయోగించే పీఎస్​ఎల్​వీ-సీ58 ఎక్స్‌పోశాట్ మిషన్ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణె దంపతులు స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఇస్రో బృందాన్ని టీటీడీ ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఏడాది తొలి రోజే పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేసింది. పీఎస్ఎల్వీ వాహకనౌక మన దేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహంను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించి సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్​లో కౌంట్​డౌన్​ ప్రక్రియ ఈరోజు ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైంది. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్వీ-సీ58 వాహకనౌక షార్​లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. 

Last Updated : Dec 31, 2023, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.