International Training Program on Cyber Security in KL University: "నైపుణ్యం, టెక్నాలజీలు కీలక పాత్ర.. దక్షిణ కొరియా దేశాలలో యువతకు డిమాండ్" - AP Skill Development Corporation CEO Vinod Kumar
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 11:58 AM IST
International Training Program on Cyber Security in KL University : ఏపీకి చెందిన యువతకు సరికొత్త రంగాల్లో శిక్షణ అందించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈఓ వినోద్ కుమార్ (AP Skill Development Corporation CEO Vinod Kumar) వెల్లడించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేఎల్ యూనివర్సిటీ వేదికగా అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సైబర్ సెక్యూరిటీపై 5 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం ఉపాధిలో నైపుణ్యం,టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వియత్నాం, దక్షిణ కొరియా దేశాలలో ఆంధ్రప్రదేశ్ యువతకు మంచి డిమాండ్ ఉందని స్పష్టం చేశారు. అమెరికా బదులు తమ దేశాలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ నిపుణులను పంపాలని ఆయా దేశాల ప్రభుత్వాలు కోరాయని వివరించారు. సైబర్ సెక్యూరిటీపై శిక్షణ కోసం 900 మంది వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారని స్పష్టం చేశారు. డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ అందించే శిక్షణ కార్యక్రమాల్లో 70శాతం ఐటీ, ఇంజనీరింగ్ సంబంధించనవే అని తెలిపారు.