Independence Day Celebrations in Janasena Office: జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జనసేనాని జాతీయ పతాకావిష్కరణ - పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు
🎬 Watch Now: Feature Video
Independence Day Celebrations In Janasena State Office: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జనసేన ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు. జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు. జెండా ఎగరవేసిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతేకాకుండా భారత మాత నినాదాలతో పార్టీ కార్యాలయ ప్రాంతం మార్మోగింది. జాతీయ పతాకావిష్కరణ కోసం పార్టీ కార్యాలయ ప్రాంతాన్ని సర్వంగ సుందరంగా అలకరించారు. రంగు రంగుల పుష్పలతో వేడుకలు నిర్వహించిన ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా అలంకరణ ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల జనసేన నాయకులు జెండా పండగను ఘనంగా నిర్వహించి.. స్వాతంత్య్ర సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.