గుడివాడలో దారుణం - భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త - హత్య వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 24, 2023, 8:55 PM IST
|Updated : Dec 24, 2023, 9:06 PM IST
Husband Killed Wife in Gudivada NTR Colony: కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ కాలనీలో కుటుంబ కలహాలతో మహిళ దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యనారాయణ అనే వ్యక్తి భార్య రామలక్ష్మిను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. సూర్యనారాయణను అడ్డుకుపోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను గాయపరిచాడు. భీమవరానికి చెందిన సూర్యనారాయణతో, రామలక్ష్మికు ఐదేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో విభేదాలు కారణంగా నాలుగేళ్ల కుమారుడుతో కలిసి ఎన్టీఆర్ కాలనీలోని పుట్టింట్లో రామలక్ష్మి ఉంటుంది.
పెద్ద మనుషుల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించుకుందామని గుడివాడ రావాల్సిందిగా రామలక్ష్మి కుటుంబ సభ్యులు సూర్యనారాయణకు కబురు పెట్టారు. ఈ క్రమంలో ఇంట్లో పనులు చేసుకుంటున్న రామలక్ష్మిను భర్త సూర్యనారాయణ విచక్షణా రహితంగా పొడిచి చంపి పరారయ్యాడు. అడ్డుకోబోయిన రామలక్ష్మి తండ్రి వెంకన్నను సైతం సూర్యనారాయణ గాయపరిచాడు. ప్రస్తుతం రామలక్ష్మి తండ్రి వెంకన్న కత్తిపోట్లతో గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సూర్యనారాయణ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గుడివాడ వన్ టౌన్ పోలీసులు వెల్లడించారు.