పార్టీ కన్నతల్లి లాంటిది - అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యం: ఎంపీ గోరంట్ల మాధవ్ - andhra pradesh
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 6:45 PM IST
Hindupur MP Gorantla Madhav Reaction on Seat Issue: హిందూపురంలో టికెట్ రాకపోవడం పట్ల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ తనకు కన్నతల్లి లాంటిదని టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యమన్నారు. పార్టీలో కలహాలు సృష్టించేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూపురంలో బోయ సామాజిక వర్గానికి చెందిన మహిళను పోటీకి పెట్టాలని పార్టీ నిర్ణయించిందని గోరంట్ల తెలిపారు. పార్టీ ఏం ఆదేశిస్తే అది చేస్తానని, అధినేత ఏం ఆదేశిస్తే అవే శిరోధార్యమని అన్నారు. తన సీటుపై సోషల్ మీడియాలో హడావుడి అక్కర్లేదని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రితో, అదే విధంగా తాను సజ్జల రామకృష్ణా రెడ్డితో గొడవపడినట్లు తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో కలహాలు పెట్టడానికే ఇలాంటివి చేస్తున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకు పరిమితం అయిందని, వచ్చే ఎన్నికల్లో 3 సీట్లే వస్తాయేమో అని ఎద్దేవా చేశారు.