High Tension in Tadipatri: తాడిపత్రిలో ప్రహరీ వివాదం.. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. క్షణక్షణం ఉత్కంఠ - జేసీ వర్సెస్ పోలీసులు
🎬 Watch Now: Feature Video
High Tension in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో కళాశాల ప్రహరీ వివాదం మరింత ముదిరింది. ప్రహరీ నిర్మించి, గేటు ఏర్పాటు చేయటానికి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టూ.. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రహరీ విషయంలో కొద్దిరోజులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి అనుచరులు ప్రహరీ నిర్మించి, గేటు ఏర్పాటు చేయటానికి సమయత్తమవగా.. పోలీసులు జేసీ ఇంటి చుట్టూ బారీకేడ్లు నిర్మించారు. ప్రహరీ వివాదంపై అధికారులతో విచారణ జరగలేదని, వైసీపీ ఎమ్మెల్యేకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జేసీ ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 120 అడుగుల రోడ్డును.. 40 అడుగులకు కుదించి ప్రహరీ నిర్మిస్తున్నారని జేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రిలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.