ఏపీ సీఐడీ చీఫ్, ఏఏజీలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్​పై విచారణ వచ్చే వారానికి వాయిదా

🎬 Watch Now: Feature Video

thumbnail

HC Hearing on Petition Filed Against CID AAGs: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సత్యనారాయణ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో బుధవారం విచారణ జరిగింది. 

Petitioner Satyanarayana Lawyer Arguments: విచారణలో భాగంగా పిటిషనర్ సత్యనారాయణ తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 'స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారం దర్యాప్తులో ఉండగానే సీఐడీ చీఫ్ సంజయ్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలు ప్రెస్‌మీట్లు పెట్టారు. వారి ప్రెస్‌మీట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేశారు. చార్జిషీట్ దాఖలు చేయకుండా, విచారణ ముగియక ముందే ఇలా చేయటం ద్వారా ప్రజాధనం వృథా అయింది' అని కోర్టుకు తెలియజేశారు. దీంతో ప్రజాధనం ఎంత వృథా అయిందో ఆ వివరాలను కోర్టుకు తెలపాలని న్యాయస్థానం కోరగా.. ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది తెలిపారు. మరోసారి కోర్టు అనుమతితో ఆర్టీఐ ద్వారా వివరాలు అడగాలని హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.