Sand Lorry రోడ్డు ఎక్కలేక 14 గంటల పాటు ఇసుక లారీ నిలిచిపోయిన వైనం.. ఇరువైపులా ట్రాఫిక్ జామ్! - Heavy traffic jam due to sand lorry stopped
🎬 Watch Now: Feature Video
Traffic Jam Due to Sand Lorry: అన్నమయ్య జిల్లా రాజంపేట - రాయచోటి ఘాట్ రోడ్డులో సాంకేతిక లోపంతో ఇసుకు లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ ఆగిపోవడంతో రాత్రి నుంచి కొన్ని గంటలపాటు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో రోడ్డుకి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. చేసేదేమి లేక కొందరు ప్రయాణికులు కాలినడకనే గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. మరోవైపు బస్సులు రాకపోవడంతో రోజు వారి విధులకు వెళ్లేవారు బస్టాండ్‌లోనే గంటల తరబడి పడిగాపులు కాశారు.
బస్సులు అగిపోవడం వలన పలువురు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రాత్రి నుంచి ఇదే పరిస్థితి ఉన్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరించారని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక లారీ అధికార పార్టీ నేతకు చెందినది కావడం వలనే.. అధికారులు పట్టించుకేలేదని, చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేశారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో సుమారు 14 గంటలకు పైగా వాహనాల రాకపోకలు ఆగిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.