GANESH IDOL WITH CURRENCY అకట్టుకుంటున్న రూ.1.51కోట్లతో అలంకరించిన వినాయకుడు.. చూసేందుకు తరలివస్తున్న ప్రజలు
🎬 Watch Now: Feature Video
GANESH IDOL WITH CURRENCY: వినాయక చవితి పండుగ అంటే వివిధ రూపాల్లో ఉన్న గణనాథులే మాత్రమే కాదు.. అనేక రకాల ఆకృతుల్లో తయారుచేసిన మండపాలు కూడా మనకు చాలా చోట్ల దర్శనమిస్తాయి. అలా ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని వాసవి మార్కెట్లో రూ.1.51 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించిన వినాయక విగ్రహం ఇప్పుడు పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వామివారితో పాటు మండపాన్ని కూడా కొత్త కరెన్సీ నోట్లతో అందంగా ముస్తాబు చేశారు. స్వామివారిని ఇలా అలంకరించడానికి రూ.500, రూ.200, రూ.50 కరెన్సీ నోట్లను వినియోగించారు. కరెన్సీతో ముస్తాబైన ఆ గణనాదుడిని చూడడానికి పట్టణంలోని జనం పెద్ద సంఖ్యలో అక్కడి తరలి వస్తున్నారు. గత 41 సంవత్సరాలుగా నందిగామ వాసవి మార్కెట్లో వినాయక చవితి ఉత్సవాలు భారీగా నిర్వహిస్తున్నట్లు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహకులు తెలిపారు. 41వ వార్షికోత్సవం సందర్భంగానే స్వామివారిని కొత్త కరెన్సీ నోట్లతో అలకరించినట్లు కమిటీ నిర్వహకులు పేర్కొన్నారు.