విజయవాడలో అహింసా రన్ కార్యక్రమంలో పాల్గొన్న పి.టి.ఉషా - విజయవాడలో పిటి ఉషా పర్యటన వివరాలు
🎬 Watch Now: Feature Video
ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మ శ్రీ, అర్జున అవార్డు గ్రహీత పి.టి.ఉషాకు విజయవాడలోని ఓ హోటల్లో ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. జీతో సంస్థ చేపట్టిన అహింసా రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి.టి.ఉషా హాజరయ్యారు. విజయవాడ రావడం ఎంతో సంతోషంగా ఉందని పి.టి ఉషా అన్నారు. తాను 13వ ఏటా అథ్లెటిక్స్ ప్రయాణం మొదలు పెట్టినట్లు తెలిపారు. 13 సంవత్సరాలకు అండర్ 16 వాళ్ళ తో పోటీ పడే స్థాయికి ఎదగడానికి తన పట్టుదలే కారణమన్నారు. కేరళలో 23 మందితో అథ్లెటిక్స్ సంస్థ ప్రారంభించి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేశానన్నారు. రాజ్యసభ సభ్యురాలుగా అవకాశం కల్పించినందుకు ప్రధాన మంత్రి మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం క్రీడల పట్ల యువతలో ఆసక్తి పెరుగుతోందని అది తనకు ఎంతో సంతోషాన్నిస్తుందని ఉషా వెల్లడించారు. పిల్లల్లో ఉన్న ప్రతిభ ను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా తన శక్తి మేరకు క్రీడల అభివృద్ధికి కృషి చేశానన్నారు.