వేసవిలోనూ మంచు అందాలు.. పాడేరులో ఆకట్టుకుంటున్న దృశ్యాలు - ప్రకృతి ప్రేమికులు
🎬 Watch Now: Feature Video
ప్రకృతి అందాన్ని ఆస్వాదించాలనీ ప్రకృతి ప్రియులు ఆసక్తి పడుతుంటారు. మంచు కురుస్తుంటే అందరికీ ఆనందమే. సర్వ సాధారణంగా శీతకాలంలో కనిపించే మంచు వేసవిలోనూ ఆహ్లాదాన్ని అందిస్తోంది. మంగళవారం ఉదయం పాడేరులో పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయాన్నే పొగమంచు నుంచి సూర్యుడు బయటకు వస్తుంటే ప్రకృతి చాలా అందంగా చూడటానికి చూడముచ్చటగా ఉంది. సహజసిద్దమైన ఆ అందాలు మనసును కట్టిపడేస్తున్నాయి. పొగమంచు పర్యాటకులను ఆకర్షిస్తోంది.
అల్లూరి సీతారామ రాజు జిల్లా కేంద్రం పాడేరు పరిసర కొండలు వేసవిలో శీతాకాల వాతావరణం సంతరించుకుంది. కొండల నడుము శ్వేత కైలాస మంచు శిఖరాలు కట్టిపడేస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, సాయంత్రం చిరుజల్లులతో భిన్న వాతావరణం కలిగి ఉంటుంది. కొండలపై సూర్యోదయంతో లోయల్లో మంచు ప్రత్యేక పర్యాటక అందాన్ని చూపిస్తోంది. సోమవారం ఒకే రోజులోనే మూడు కాలాలు దర్శనమిచ్చాయి. పాడేరులో సోమవారం 15 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. వేకువజాము నుంచి చలితో ద్విచక్ర వాహన చోదకులు గజగజ వణకిపోయారు.