అనకాపల్లిలో మత్స్యకారుల వినూత్న నిరసన - ఆదుకోవాలంటూ జలదీక్ష - Jal Diksha in anakapalli
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 5:22 PM IST
Fishermen Tookup Jal Diksha: అనకాపల్లిలో మత్స్యకారులు వినూత్న నిరసనకు దిగారు. తుపాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన తమకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపెట్టాలని జల దీక్ష చేపట్టారు. అనకాపల్లి జిల్లా ధర్మవరం పంచాయతీ శివారు కామన్గడ్డలో మిగ్ జాం తుపాను కారణంగా నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో జీవనోపాధికి ఉపయోగపడుతున్న వలలు, ధోనిలు, మత్స్య వేటకు సంబంధించిన పరికరాలు నీట మునిగాాయని మత్స్యకారులు వాపోయారు.
చాలా ప్రాంతాల్లో మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంవృద్ధి యోజన పథకం ద్వారా చేప పిల్లల పంపిణీ జరిగిందని తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం తమకు పంపిణీ చేయకుండా అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నీటిలోకి దిగి మత్స్యకారులు జల దీక్ష చేపట్టారు. ప్రభుత్వం స్పందించి జీవనోపాధి కల్పించి, నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మత్స్యకార సంఘ నాయకులతోపాటు సీపీఎం కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.