కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై న్యాయస్థానాల ఉత్తర్వుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది: బుగ్గన - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-11-2023/640-480-19972040-thumbnail-16x9-finance--minister-buggana--on-ap-development.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 12:08 PM IST
Finance Minister Buggana on AP Development: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు న్యాయస్థానాల ఉత్తర్వుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల సమీక్షా సమావేశాన్ని ఆయన కర్నూలులో నిర్వహించారు. త్వరలో కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కర్నూలుకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి 80 కోట్ల రూపాయలతో సుంకేసుల నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటికే నగరంలో హ్యూమన్ రైట్స్, లోకాయుక్త కార్యాలయాలను నగరంలో ఏర్పాటు చేశామన్నారు. సిల్వర్ జూబ్లీ విద్యాలయాన్ని జగన్నాథ గట్టు మీద 130 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని.. రాయలసీమకు ఎంతో అభివృద్ధిని చేశామని వివరించారు.
" కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు న్యాయస్థానాల ఉత్తర్వుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. త్వరలో కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. కర్నూలుకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి 80 కోట్ల రూపాయలతో సుంకేసుల నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే నగరంలో హ్యూమన్ రైట్స్, లోకాయుక్త కార్యాలయాలను నగరంలో ఏర్పాటు చేశాం." - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక మంత్రి