Farmers Protest At Electricity Substation : 15రోజులుగా పవర్ కట్.. ఎండుతున్న పంటలు.. సబ్‌స్టేషన్ ముట్టడించిన రైతులు - Minister Sidiri Appalaraju
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2023, 4:23 PM IST
|Updated : Aug 23, 2023, 4:55 PM IST
Farmers Protest At Electricity Substation : శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి విద్యుత్తు సబ్ స్టేషన్ను రైతులు ముట్టడించారు. తారకరామ ఎత్తిపోతల పథకానికి 15రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిపివేయడం అన్యాయం అంటూ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. మూడు పంచాయతీల పరిధిలో 2వేల మంది రైతులకు చెందిన 1,650 ఎకరాల వరి పంట ఎండిపోతోందని, తక్షణమే సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పలాస ప్రాంతానికి సాగునీరు అందడం లేదన్న కారణంగా మంత్రి సీదిరి అప్పలరాజు ప్రోద్బలంతో వంశధార ఎడమ ప్రధాన కాలువ పరిధిలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏటా ఖరీలో ఇదేరీతిన ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. జిల్లా కలెక్టర్ సూచనలతోనే తాము సరఫరా నిలిపివేశామని అధికారులు వివరణ ఇవ్వగా.. సంబంధిత ఉత్తర్వులు చూపాలంటూ రైతులు పట్టుబడటంతో వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారితీసింది. ఎత్తిపోతల పథకాలన్నింటికీ విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో వాటికింద ఉన్న పొలాలకు సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కూడా ఆలస్యం కావటం, పడిన వర్షాలు సరిపోకపోవటంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.