Farmers Protest agricultural power: ఇచ్చేదే మూడు గంటల కరెంట్ అందలోను కోతలు.. అగళిలో రైతులు నిరసన
🎬 Watch Now: Feature Video
Farmers Protest agricultural power: శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండల కేంద్రంలోని విద్యుత్ ఉప కేంద్రం వద్ద రైతులు నిరసన చేపట్టారు. విద్యుత్ కోతల వల్ల తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు నినాదాలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రకారం పంట పొలాలకు తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలి. కానీ మూడు గంటల మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని.. అది కూడా అంతరాయాలతో ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. చెప్పినట్లుగానే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా ఇస్తుందనే నమ్మకంతో లక్షల రూపాయాలు అప్పు చేసి పంటలు సాగు చేశామని రైతులు తెలిపారు. కానీ ఇప్పుడు మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారని.. అది అంతరాయాలతో కూడిన విద్యుత్ సరఫరా చేస్తున్నారని.. దీంతో పంటలు ఎండి పోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు తొమ్మిది గంటల నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని రైతులు కోరారు.