Farmers Pelt Stones on Substation in Peruru Sathya Sai District: సబ్‌స్టేషన్‌పై రాళ్లు విసిరిన రైతులు.. అధిక విద్యుత్ కోతలంటూ.. - విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు
🎬 Watch Now: Feature Video
Farmers pelt stones on substation in Peruru Sathya Sai District: విద్యుత్ కోతలతో విసిగిపోయిన రైతులు విద్యుత్ సబ్ స్టేషన్‌పై రాళ్లు విసిరారు. విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. సరఫరా చేస్తున్న విద్యుత్ నాసిరకంగా ఉంటోందని, మోటార్లకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేంజరిగిందంటే.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండల రైతులు.. వ్యవసాయ బావులకు విద్యుత్ లోవోల్టేజీలో సరఫరా అవుతోందని.. పేరూరులోని సబ్‌స్టేషన్‌పై రైతులు రాళ్లు విసిరారు. విద్యుత్ కోతలు సైతం అధికంగా ఉంటున్నాయని.. ఈ సమస్యను గతంలో అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు రైతులు తెలిపారు. విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విన్నవించుకున్న అధికారులు తమ గోడు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఒక్కసారిగా రాళ్లు విసరటంతో ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయంతో కార్యాలయం గదిలోనే ఉండిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేశారు.