వైఎస్సార్సీపీలో బీసీలకు గుర్తింపు లేదు - జనసేన విజయానికి పాటు పడతా: ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ - MLC Vamsikrishna Srinivas
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-12-2023/640-480-20392349-thumbnail-16x9-etv-bharat.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 6:00 PM IST
|Updated : Dec 30, 2023, 6:12 PM IST
ETV Bharat interview with MLC Vamsikrishna Srinivas Yadav: ముఖ్యమంత్రి జగన్ విధానాలతో వైఎస్సార్సీపీలోని నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనంతో ఉన్నారని, ఆ పార్టీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైఎస్సార్సీపీ అవసాన దశలో ఉందన్నారు. జనసేన పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. గత కొంత కాలంగా వైస్సార్సీపీకి చెందిన నేతలు బీసీలకు న్యాయం చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ వాళ్లకు నచ్చింది చేస్తే, బీసీలకు న్యాయం చేయడం కాదని వెల్లడించారు. వైఎస్సార్సీపీలో ఉన్న బీసీ నేతలకు సరైన గుర్తింపు లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసం సీఎం జగన్ సెల్ప్గోల్ కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఆశించి వచ్చినవారికి ఇక్కడ ఏం లేదని అర్థమైందని వంశీకృష్ణ పేర్కొన్నారు. తనకు ఉన్న పరిచయాలతో జనసేనకు సపోర్టు చేసే విధంగా ప్రచారం చేస్తానని తెలిపారు. జనసేనలో చేరిన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. సీఎం జగన్పై ఉన్న అభిమానంతో ఇన్నాళ్లు వైఎస్సార్సీపీలో ఉన్నానని చెబుతున్న వంశీకృష్ణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.