Employee facial recognition system attendance : ఉద్యోగులంతా 'ఎఫ్ఆర్ఎస్ హాజరు' పాటించాలి.. సాధారణ పరిపాలన శాఖ ఆగ్రహం - ఉద్యోగుల హాజరు విధానం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 1:22 PM IST
Employee facial recognition system attendance : ఫేషియల్ రికగ్నేషన్ విధానం ద్వారా పూర్తి స్థాయిలో ఉద్యోగుల హాజరు నమోదు కాకపోవడం పై సాధారణ పరిపాలన శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ మెమో జారీ చేసింది. ఫేస్ రికగ్నేషన్ యాప్లో 100 శాతం ఉద్యోగులు ఇంకా నమోదు చేసుకోలేదని జీఏడీ పేర్కొంది. ఇప్పటికీ కేవలం 45 - 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు వేస్తున్నారని గుర్తించింది. చాలా మంది ఉద్యోగులు ఉదయం ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా చెక్ ఇన్ అయినా యాప్ ద్వారా చెక్ అవుట్ కాకపోవడంపై జీఏడీ అభ్యంతరం తెలిపింది.
ఉద్యోగుల సెలవులను ఎఫ్ఆర్ఎస్ విధానం ద్వారా నమోదు చేయాల్సి ఉన్నా ఉద్యోగులు దాన్ని పాటించడం లేదని స్పష్టం చేసింది. ఇన్ఛార్జ్లు, పర్యవేక్షణా అధికారుల లోపం వల్లే ఫేస్ రికగ్నిషన్ విధానం అమలు సరిగా లేదని సాధారణ పరిపాలన శాఖ మెమోలో పేర్కొంది. ఎఫ్ఆర్ఎస్ సరిగ్గా అమలయ్యేలా ఇన్చార్జులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలు.. హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లకు జీఏడీ మెమో జారీ చేసింది.